నాచురల్ స్టార్ నాని( Nani ) హాయ్ నాన్న(Hi Nanna) సినిమా ద్వారా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే నాని విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
నాని హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్( Saindhav ) సినిమాలు రెండు కూడా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ తన సినిమాల గురించి అలాగే నాని కూడా తన సినిమాల గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలిపారు. ఇక వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలామంది హీరోలు కొన్ని ఎమోషనల్ సీన్స్ చేయటం పెద్దగా సూట్ అవ్వదు వారు ఏడ్చే సీన్లలో నటిస్తే ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేరని కానీ నువ్వు నేను మాత్రం ఎమోషనల్ సీన్స్ చేస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ఇది ఒక బహుమతి అంటూ వెంకటేష్ మాట్లాడారు.

ఇలా వెంకటేష్( Venkatesh ) చేసినటువంటి వ్యాఖ్యలకు నాని కూడా స్పందిస్తూ మరికొన్ని విషయాలను వెల్లడించారు.ఇది ఒక విషయంలోనే కాదు సర్ సినిమాలపరంగా మీలో నాలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి అంటూ నాని తెలియజేశారు.మనం నటించే సినిమాలలో కామెడీ, మాస్, ఎమోషన్ ఈ మూడింటిలో ప్రేక్షకులు మిమ్మల్ని అంగీకరించినట్టే నన్ను కూడా అంగీకరించారని ఇది మన ఇద్దరికీ ఓ గొప్ప వరం అంటూ నాని వెంకటేష్ తో మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక వెంకటేష్ కూడా ఇలాంటి జానర్ లో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక నాని కూడా ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే మరోవైపు మాస్ ఎమోషనల్ సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
దసరా వంటి మాస్ సినిమా తర్వాత మరొక ఎమోషనల్ సినిమా ద్వారా నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.