సుందరం కూడా పెంచడం లేదట.. ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్లొచ్చు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా ఉంది.ఎప్పుడెప్పుడు అంటూ ఏపీ లో టికెట్ల రేట్ల పెంపు జీవో కోసం ఎదురు చూసిన వారు ఇప్పుడు బాబోయ్‌ అంత టికెట్ల రేట్లు ఎందుకు కాస్త తగ్గించండి అంటూ సినిమా వర్గాల వారే అంటున్నారు.

 Nani Ante Sundaraniki Movie Tickets Price Not Increase , Ante Sundaraniki , F-TeluguStop.com

సినిమా టికెట్ల రేట్ల విషయంలో గత కొంత కాలంగా జరుగుతున్న చర్చ పతాక స్థాయికి చేరుకుంది.అధనంగా పెరిగిన టికెట్ల రేట్లను కాదని పెద్ద సినిమా లు మొదటి వారం లేదా పది రోజుల పాటు కనీసం వంద రూపాయలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

వారికి వచ్చిన అవకాశం తో ఈమద్య వచ్చి సినిమా లకు టికెట్ల రేట్లు పెంచారు.ఒక ప్యామిలీ సినిమా కు వెళ్లాలి అంటే ఏకంగా రెండు వేల నుండి ఇరవై అయిదు వందల వరకు పెట్టాల్సి వచ్చింది.

దాంతో పెద్ద సినిమా ల వైపు కూడా చాలా మంది ప్రేక్షకులు చూడటం లేదు.దాంతో ఓటీటీ లో ఆ సినిమా లను చూడటం కోసం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకుంటున్నారు.

అందుకే ఎఫ్ 3 సినిమా కు టికెట్ల రేట్లను పెంచడం లేదు అంటూ ముందు నుండి ప్రకటించారు.అన్నట్లుగానే టికెట్ల రేట్లను పెంచకుండా ఉన్న రేట్ల తోనే వచ్చారు.

ఆ సినిమాకు ఓ మోస్తరు గా వసూళ్లు నమోదు అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా కూడా థియేటర్లకు క్యూ లు కట్టే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పుడు అంటే సుందరానికి సినిమాకు కూడా టికెట్ల రేట్లను పెంచే వీలు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.పెంచుకునే అవకాశం ఉన్నా కూడా టికెట్ల రేట్లను పెంచడం లేదు అంటూ వారు తెలియజేశారు.

ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే విధంగా మా సినిమా కు క్లీన్ యూ వచ్చింది.కనుక మీరు మీ చిన్న పిల్లలతో సహా సినిమా ను చూడవచ్చు అంటూ సుందరం టీమ్ చెబుతున్నారు.

అద్బుతమైన సినిమా అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మంగా చెబుతున్నారు.అందుకే అంటే సుందరం కు టికెట్ల రేట్లు కూడా తక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ప్లో ఖాయంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube