బాలయ్య ఖాతాలో మరో రికార్డ్.. వరుసగా మూడు 100 కోట్ల సినిమాలతో హ్యాట్రిక్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) మరో అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈయన ఈ ఏజ్ లో సినిమాలు చేయడమే కాకుండా ఇలాంటి రికార్డులు కూడా నమోదు చేస్తూ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తున్నాడు.

 Nandamuri Balakrishna's Bhagavath Kesari Hat Trick Record, Bhagavanth Kesari, Bh-TeluguStop.com

అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ పడిన తర్వాత ఈయన కెరియర్ జోరుగా సాగుతుంది.ఇక ఈ సినిమా విజయం సాధించిన తర్వాత బాలయ్య ఏది చేసిన తిరుగుండడం లేదు.

ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి మరో హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు దసరా సీజన్ ను కూడా కబ్జా చేసాడు.

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి” ( Bhagavanth Kesari ) సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

-Movie

మొన్న అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.దసరా పండుగ ముగిసిన కూడా ఈ సినిమా జోరు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను అఫిషియల్ గా ప్రకటించారు.ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ ( Bhagavanth Kesari Collections )ను సొంతం చేసుకోగా బాలయ్య కెరియర్ లో ఒక రికార్డ్ నమోదు అయ్యింది.

బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలతో 100 కోట్లు అందుకోవడంతో వరుసగా మూడు 100 కోట్లు అందుకుంది హ్యాట్రిక్ కొట్టాడు.ఈ అరుదైన రికార్డ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

-Movie

వరుసగా మూడు 100 కోట్ల సినిమాలు ( Balakrishna 100 Crore Films )అది కూడా రీజనల్ గా మాత్రమే రిలీజ్ అయ్యాయి.ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి.కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube