బీజేపీ లో జారిపోతున్న నేతలు !  చేరే వారు ఏరి ?  

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడో విడుదలైంది.మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుండడంతో,  అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయాయి.

 Leaders Slipping In Bjp! Who Will Join , Telangana Bjp , Bjp, Congress, Brs-TeluguStop.com

పూర్తిగా ప్రజలకు చేరువ అయ్యేందుకు అన్ని పార్టీలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  ఇక ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మరింత ముమ్మరం అయ్యాయి .ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బిజెపి పరిస్థితి దారుణంగా మారింది .ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల ( Congress BRS party )మధ్య అన్న ప్రచారం జరుగుతుండడంతో బిజెపిలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు క్యూ కడుతుండడం తో తెలంగాణ బిజెపిలో ఆందోళన కలిగిస్తోంది.పార్టీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప కొత్తగా చేరికలు లేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.ఇటీవల కాలంలో పార్టీని వీడుతున్న వారిలో ఎక్కువమంది వివిధ కీలక పదవుల్లో ఉన్నవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Telugu Brs, Congress, Dk Aruna, Komatirajagopal, Telangana Bjp, Telangana, Vijay

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఏడాదిన్నర క్రితం చాలామందిని బిజెపిలో చేర్చుకున్న వారిలో చాలామంది ఇప్పటికే పార్టీని వీడారు.ముఖ్యంగా డాసోజు శ్రవణ్ కుమార్,  స్వామి గౌడ్ , యెన్నం శ్రీనివాస్ రెడ్డి ,మోత్కుపల్లి నరసింహులు,  రాపోలు ఆనంద భాస్కర్,  మాజీమంత్రి చంద్రశేఖర్ , ఎర్ర శేఖర్,  జిట్టా బాలకృష్ణారెడ్డి , నాగం జనార్దన్ రెడ్డి , పుష్పలీల ,రాజగోపాల్ రెడ్డి వంటి వారు బిజెపికి గుడ్ బాయ్ చెప్పారు.ఇంకా డీకే అరుణ విజయశాంతి, ( Vijayasanthi )వివేక్ ,కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,జితేందర్ రెడ్డి వంటి వారు పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడంతో , తెలంగాణ బిజెపిలో ఆందోళన మొదలైంది.

కీలకమైన ఎన్నికల సమయంలో పేరున్న నేతలు బయటకు వెళ్లిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.అయితే పార్టీని వీడి వెళ్లేవారంతా తెలంగాణలో బిజెపి గెలిచి అవకాశం లేదని ,ఆ పార్టీ నుంచి పోటీ చేసినా పరువు పోతుందనే భయం వారిలో నెలకొందట.

Telugu Brs, Congress, Dk Aruna, Komatirajagopal, Telangana Bjp, Telangana, Vijay

 ఇక ఈటల రాజేందర్( Etela Rajender ) సైతం బిజెపిలో ఇమడ లేకపోతున్నారని, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు రాజేందర్ కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయట .రాజేందర్ కు గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ టికెట్ ను ఇచ్చారు.అయితే తాను బిజెపి( BJP )లో చేరే సమయంలో తన వెంట వచ్చిన కీలక నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కన పెట్టడంపై రాజేందర్ అసంతృప్తితో ఉన్నారట.

వేములవాడ టికెట్ కోసం తన వెంట బిజెపి లో చేరినా,  అక్కడ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు టికెట్ ఇస్తుండడంపై ఈటల పార్టీ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు బిజెపి నుంచి ఉండబోతుండడం ఆ పార్టీ అధిష్టానం పెద్దలకు కూడా ఆందోళన కలిగిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube