టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్‘ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది.
థియేటర్ లోనే కాదు ఓటిటీ లో కూడా దుమ్ము దులిపింది.తీవ్రవాదం ఎన్ ఐ ఏ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.
నాగార్జున ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న ప్రకటించాడు.
ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మొదలు పెట్టగానే లాక్ డౌన్ అవ్వడంతో వాయిదా పడింది.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.కాబట్టి ఈ సినిమాను జూన్ మొదటి వారంలోనే స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం సెట్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.అవసరమైనంత మందితో ఎలాంటి కుదింపులు లేకుండా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.నాగార్జున కూడా ప్రవీణ్ సత్తారు కు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట.
ఈ సినిమాలో మొదటిసారిగా కాజల్ అగర్వాల్ నాగార్జునకు జోడీగా నటిస్తుంది.నారాయదాస్, రామ్మోహన్ రావు,శరత్ మరార్ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో పాటు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు.
మొత్తానికి నాగార్జున కుర్ర హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నాడు.