చిరంజీవి, బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే చూసి నాగ్ అలా ఫీలయ్యారా.. ఎం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య( Chiranjeevi, Balayya ) సినిమాలలో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి.ఈ ఇద్దరు హీరోలు మాస్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ కు కలిగే సంతోషం అంతాఇంతా కాదు.

 Nagarjuna Opinion About Chiranjeevi Balakrishna Dialogues Details Here Goes Vira-TeluguStop.com

ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇతర హీరోలతో సైతం సన్నిహితంగా మెలుగుతారు.మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఈ హీరోల సినిమాలలో డైలాగ్స్ ఉంటాయి.20 ఏళ్ల క్రితం ఈ హీరోలు చెప్పిన కొన్ని సినిమాల డైలాగ్స్ ఇప్పటికీ మారుమ్రోగుతుంటాయి.

అయితే నాగార్జున( Nagarjuna ) ఒక సందర్భంలో చిరంజీవి, బాలయ్య డైలాగ్స్ గురించి ఆసక్తికర కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

కింగ్ సినిమాలో నేను నటించిన తర్వాత చాలామంది నన్ను బొట్టుశ్రీను( Bottusrinu ) అని పిలిచేవారని నాగార్జున పేర్కొన్నారు.బొట్టుశ్రీను లాంటి పాత్రలే మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని నాగార్జున చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Biggboss, Bigg Boss, Bottusrinu, Chiranjeevi, Nagarjuna-Movi

చిరంజీవి, బాలకృష్ణ మాస్ సినిమాలలో డైలాగ్స్ చెబుతుంటే నాకు ఎంతగానో నచ్చుతుందని నాగ్ అన్నారు.హై స్పీడ్ వాక్స్, డైలాగ్స్ చెప్పే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుందని నాగ్ చెప్పుకొచ్చారు.నాగ్ కొత్త సినిమా ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఆగష్టు 29వ తేదీన నాగ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

Telugu Balakrishna, Biggboss, Bigg Boss, Bottusrinu, Chiranjeevi, Nagarjuna-Movi

ఆరోజు నాగ్ కొత్త సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.నాగ్ హోస్ట్ గా చేస్తున్న బిగ్గ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) సెప్టెంబర్ 3వ తేదీ నుంచి మొదలుకానుంది.ఈ సీజన్ గత సీజన్లలా ఉండదని చెబుతున్న నాగార్జున బిగ్ బాస్ షో సీజన్7 తో ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి.బిగ్ బాస్7 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube