డిసెంబర్ 1న విడుదల కానున్న నాగ శౌర్య ‘లక్ష్య’ ట్రైలర్..

యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగశౌర్య రీసెంట్ గా వరుడు కావలెను సినిమాతో సక్సెస్ సాధించారు.ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు.

 Naga Shourya 'lakshya' Trailer To Be Released On December 1 , Naga Shourya, Laks-TeluguStop.com

లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

లక్ష్య థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతోన్నారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగశౌర్య చేతికి గాయమైనా కూడా ట్రైనింగ్ సెషన్‌లో బిజీగా ఉన్నారు.

ఇక ఇందులో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ అందరినీ ఆకట్టుకుంటుంది.

విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.

ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు.ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.

Telugu December, Japathi Babu, Kethika Sharma, Lakshya Trailer, Naga Shourya, To

ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు.సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.

లి.బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రయోగం చేసేందుకు రాబోతోన్నారు.కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు :

నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ తదితరులు.

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి నిర్మాతలు : నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డిసంగీతం : కాళ భైరవఎడిటర్ : జునైద్ పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube