కేసీఆర్ ను చూసి జగన్ నేర్చుకోవాలా ? రాజు గారి లాజిక్ ఏంటో ? 

సాధారణంగానే ఏపీ సీఎం జగన్ ఎవరి సలహాలు తీసుకోరు.ఒకవేళ ఎవరైనా ఇచ్చేందుకు ప్రయత్నించినా, ఆయన వినేందుకు ఇష్టపడరు.

 Mp Raghuramakrishnamraju Sensational Coments On Jagan Jagan, Raghurama Krishnam-TeluguStop.com

ఇది మొదటి నుంచి ఆయన వైఖరి.జగన్ కు సలహాలు ఇచ్చేందుకు పార్టీలోనూ ప్రభుత్వపరంగా, సలహాదారులు చాలామంది ఉన్నారు అయినా వారి సలహాలను పెద్దగా తీసుకునేందుకు ఎప్పుడు మొగ్గు చూపించలేదు.

ఏ నిర్ణయం అయినా, ఆయన సొంతంగానే  తీసుకుంటూ, సొంత అభిప్రాయాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు.అందులోనూ తనకు గిట్టనివారు, తనపై నిత్యం అనేక ఆరోపణలు చేస్తూ, మంట పుట్టిస్తున్న నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సలహాలు ఇస్తే, తీసుకునేందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడరు.

అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్ అడిగినా, అడగకపోయినా, నిత్యం సలహాలు ఇస్తూ , జగన్ కు మరింత మంట పుట్టిస్తున్నారు.  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ని మించిన స్థాయిలో ఆయన సలహాలు ఇస్తూ, జగన్ కు ఎక్కడలేని ఆగ్రహం కలిగిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేతులెత్తేయడం, నిర్మాణానికి సహకారం అందిస్తాము తప్ప, పునరావాస ప్యాకేజీ కి తమకు ఎటువంటి సంబంధం లేదని తెల్చేయడం వంటి వ్యవహారాలతో, కొద్దిరోజులుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఇదిలా ఉండగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడంలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ ఆదర్శంగా తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు జగన్ కు సూచిస్తున్నారు.

కేంద్రం సాయం లేకపోయినా, బ్యాంకుల్లో అప్పు తీసుకుని మరి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామనే విషయాన్ని రఘురామ కృష్ణంరాజు గుర్తుచేస్తున్నారు.అందుకే కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని జగన్ కూడా ఆయన బాటలోనే వెళ్లాలని రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు.

కేంద్ర సహాయం లేకుండా పోలవరం ప్రాజెక్టు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

సందర్భంం వచ్చిన ప్రతి సారి , ఏదో ఒక అంశాన్ని తెరపైైకి చెప్పే విధంగా తెర పైకి వచ్చే విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం రఘురామకృష్ణంరాజు అలవాటుగా మారిపోయింది.

మరో వైపు నుంచి ఆయనకు దారులు మూసుకుపోయాయి.మళ్ళీ టిడిపిలోకి కానీ , వైసీపీలోకి వెళ్లే అవకాశమేశమే కనిపించడం లేదు.

అయినా రఘురామకృష్ణంరాజు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.రాజుగారి రాజకీయం ఎంతవరకు వెళ్తుందో.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube