నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీ.నిన్న అసెంబ్లీలో రూరల్ సమస్యలపై కోటంరెడ్డి నిరసన.
ప్లకార్డుతో పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లిన శ్రీధర్ రెడ్డి.అసెంబ్లీలో నాలుగు గంటలు నిలబడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్పీకర్ పోడియం వద్దకి వెళ్లిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిని సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని.స్పీకర్ చైర్ ఏర్పాటు చేసి స్పీకర్ గా షంషుద్దీన్ ని కూర్చోపెట్టిన ఎమ్మెల్యే.
అసెంబ్లీలో తాను ఏమి చెప్పదలుచుకున్నానో ఆ అంశాల్ని మాక్ స్పీకర్ ముందు చెప్పిన ఎమ్మెల్యే.రూరల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలని వివరించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్….ప్రజా సమస్యల గురుంచి మాట్లాడేందుకు నాకు 5 నిమషాలు టైం ఇవ్వలేదు.నన్ను తిట్టేందుకు ఐదు మంది మంత్రులకు 40 నిముషాలు సమయం ఇచ్చారు.గాంధీగిరిలో నిరసన చేస్తే… సస్పెండ్ చేసి మార్షల్ చేత బయటకి పంపించారు.పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆ రోజు వరకే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారు.నేనేం చేశానని నన్ను అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారో ఆలోచించండి.
రాజకీయానికి అతీతంగా నియోజకవర్గ సమస్యని పరిష్కరించమని అడిగాను.
వంతెనల నిర్మాణం కోసం ఈనెల 30 లోపు టెండర్లు పిలవకుంటే వచ్చే నెల 6 వ తేదీన పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష చేస్తా.
ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్ళల్లో కూర్చుంటాను.ప్రజాసమస్యల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తా… మాట తప్పును, మడమ తిప్పను.అసెంబ్లీ నుంచి అధికార వైసీపీని జీవిత కాలం సస్పెండ్ చేస్తూ ప్రకటించిన మాక్ స్పీకర్ షంషుద్దీన్.