హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రగతిభవన్ ముట్టడికి పీడీఎస్ యూ విద్యార్థులు ప్రయత్నించారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని కోరారు.
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని సూచించారు.







