స్టార్ హీరోయిన్ అనుష్కకు అలాంటి చెడ్డ అలవాటుందా.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

స్టార్ హీరోయిన్ అనుష్క( Star Heroine Anushka ) వచ్చే నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ లో అనుష్క కొన్ని షాట్స్ లో క్యూట్ గా, కొన్ని షాట్స్ లో బొద్దుగా కనిపించారు.

 Miss Shetty Mister Polishetty Trailer Got Positive Response Details Here Goes Vi-TeluguStop.com

ఈ సినిమా ట్రైలర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో అనుష్కకు మరో సక్సెస్ అయితే దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Anushka Shetty, Nails, Shettymister-Movie

జాతిరత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగగా ఈ సినిమాతో మార్కెట్ మరింత పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే స్టార్ హీరోయిన్ అనుష్కకు సంబంధించి ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనుష్కకు గోర్లు కొరికే అలవాటు( Biting Nails ) ఉందని వైరల్ అవుతున్న ఆ వార్త సారాంశం.

చిన్నప్పటి నుంచి అనుష్కకు ఈ అలవాటు ఉందట.

ఈ అలవాటును మార్చుకోవాలని అనుష్క చాలా ప్రయత్నించారని అయితే ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.

ఇప్పటికీ కూడా అనుష్క చాలా సందర్భాల్లో తనకు తెలియకుండానే గోర్లు కొరికేస్తారట.ఆ అలవాటును మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఈ బ్యూటీ చెబుతున్నారట.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) తప్ప అనుష్క చేతిలో మరే ప్రాజెక్ట్ లేదనే సంగతి తెలిసిందే.

Telugu Anushka Shetty, Nails, Shettymister-Movie

అనుష్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదో లేక కొత్త ఆఫర్లు ఆమెకు రావడం లేదో తెలియడం లేదు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు అనుష్క 6 కోట్ల రూపాయల పారితోషికం( Anushka Remuneration ) తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనుష్కను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ కు ప్రముఖ సెలబ్రిటీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube