రోజా నగరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.నేతలు రెండు వర్గాలుగా విడిపోయి విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి నగరి పంచాయతీ చేరుకుంది.నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మంత్రి రోజా, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల అనంతరం శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, పుత్తూరు నుంచి వేలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజులను మంత్రి పక్కన పెట్టారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ముద్ర పడింది.
అప్పటి నుంచి రెండు గ్రూపులు విడివిడిగా నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ విభేదాలకు ఆజ్యం పోసిన కొందరు నేతలు పెద్దిరెడ్డి మద్దతుతో స్థానిక ఎన్నికల్లో రోజా అనుమతి లేకుండానే నామినేషన్లు వేస్తున్నారు.
మంత్రిగా ఉండి కూడా పెద్దిరెడ్డి మద్దతుదారులను ఏమీ చేయలేని రోజా.చివరకు ఏదో ఒకటి చేయాలని జగన్‌కు మొరపెట్టుకున్నారు.అయితే, రోజా తన సొంత నియోజకవర్గంపై ఏమీ చేయకుండా, సీఎంకు ఫిర్యాదు చేయడం ద్వారా తాను బలహీనంగా, శక్తిహీనురాలిగా నిరూపించుకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది.ఇక, రోజా సరసన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి పెద్దిరెడ్డి.
మరి ఈ విషయంలో జగన్ రోజా పక్షం వహిస్తారా లేక తన అనుచుకులకే జై కొడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

లోకల్ లీడర్స్ సపోర్ట్ చేయకపోయిన నియోజకవర్గంలో జగన్ అండంతో రోజా నెట్టుకొస్తున్నారు.వైరి వర్గం పన్నాగాలను పసిగట్టిన రోజా నిరతంరం నగరిలో తిరుగుతూ ప్రజలకు దగ్గరిగా ఉంటున్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా ఎలాగైన గెలువాలని రోజా పట్టుదలతో ఉన్నారు, చూడాలి రోజా ఆశలు నెరవేరుతాయా లేదో.