కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.మున్సిపాలిటీలోని పందులను తరలిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిపై పెంపకం దారులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి.పట్టణంలో తిరుగుతున్న పందులను పట్టుకుని తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పెంపకం దారులు వాహనం నుండి పందులను విడిపించేందుకు యత్నించారు.ఈ నేపథ్యంలో పెంపకం దారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అనంతరం తీవ్ర ఆగ్రహానికి గురైన మున్సిపల్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.