మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.కేసముద్రంలో బైపాస్ రోడ్డు పక్కనున్న బావిలోకి ఓ కారు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.మరో ముగ్గురు బావిలో గల్లంతైయ్యారు.
గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.గల్లంతైన ముగ్గురి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కాగా, ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి లచ్చివరం తండా వాసులుగా గుర్తించారు.