మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలను కూడా చిరంజీవి కమిట్ అయ్యాడు.
అవి కూడా ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది.కానీ ఆచార్య నిరాశ పర్చడం మరియు గాడ్ ఫాదర్ సినిమా యొక్క కలెక్షన్స్ తక్కువ రావడం వల్ల తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.
వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా భోళా శంకర్ యొక్క విడుదల మరియు ఆ సినిమా సాధించబోతున్న ఫలితం ఆధారంగా చిరంజీవి తదుపరి సినిమా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున భోళా శంకర్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.ఈ ఏడాది లోనే సినిమా ను విడుదల చేయబోతున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా యొక్క విడుదల తేదీని ఆగస్టు కు కన్ఫర్మ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భారీ ఎత్తున అంచనాలున్న భోళా శంకర్ సినిమా యొక్క విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ చిరంజీవి యొక్క తదుపరి సినిమా యొక్క అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఎప్పుడెప్పుడు చిరంజీవి తదుపరి సినిమా యొక్క ప్రకటన వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి తదుపరి సినిమా వెంకీ కుడుముల దర్శకత్వం లో అనుకున్నారు.
కానీ ఆయన చెప్పిన కథ కు చిరంజీవి ఇంప్రెస్ అవ్వలేదట.అందుకే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటున్నారు.
సందీప్ వంగ దర్శకత్వం లో కూడా చిరు మూవీ అన్నారు.కానీ అది కూడా ఇప్పుడు ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు.
దాంతో చిరంజీవి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.