అతనిపై కేసు పెట్టండి.. మనోజ్ బాజ్‌పేయి ఫైర్!

కొందరు ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా నిత్యం సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఈ విధంగా నిత్యం వివాదాలకు కారణం అయ్యే వారిలో బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఒకరు.

 Manoj Bajpayee, Bollywood, Krk, Criminal Complaint,latest News-TeluguStop.com

ఈయన నిత్యం వివాదాస్పద రివ్యూస్ ద్వారా వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ నటించినటువంటి రాధే చిత్రం రివ్యూస్ కారణంగా ఇతను పెద్ద చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు.

సల్మాన్ ఖాన్ ఈ విషయంలో ఏకంగా కేఆర్కే ను కోర్టుకు లాగినంత పని చేసినప్పటికీ ఇతను మాత్రం తన పద్ధతిలో ఎటువంటి మార్పులు చేసుకోక పోవడం గమనార్హం.ఈ క్రమంలోనే మరో బాలీవుడ్ నటుడు ది ఫ్యామిలీ మెన్ ఫేమ్ మనోజ్ బాజ్ పేయి కేఆర్కే పై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అతనిపై జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ ఫ‌స్ట్ క్లాస్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 500, 46 క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలియజేశారు.

Telugu Bollywood, Manoj Bajpayee-Movie

ఈ క్రమంలోనే మనోజ్ బాజ్ పేయి మాట్లాడుతూ జూలై 26 వ తేదీన కేఆర్కే తనపై చేసిన ట్వీట్ తన అభిమానులలో ,ఫాలోవర్ లలో తనకున్న ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మాట్లాడారని ఈ క్రమంలోనే అతని పై క్రిమినల్ పరువు నష్టం దావా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విధంగా కేఆర్కే వెంట వెంటనే ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన రివ్యూస్, ఎవరి పైనా విమర్శలు చేసే సమయంలో జాగ్రత్త పడాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోల నుంచి కేఆర్కే పై ఏర్పడిన వ్యతిరేక కారణంచేత ఆయన తన పద్ధతిలో ఏదైనా మార్పు వస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube