జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదంటూ మంచు మనోజ్ గత నాలుగు సంవత్సరాలుగా తమ ప్రేమ కోసం పోరాడుతూ చివరికి తన ప్రేమను గెలిపించుకున్నారు.భూమా మౌనిక రెడ్డితో 12 సంవత్సరాల పరిచయంలో గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు.
అయితే వీరి ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ చివరికి ప్రేమను గెలిపించుకున్నారు.ఇలా భూమా మౌనిక రెడ్డితో కలిసి మంచు మనోజ్ మార్చి మూడవ తేదీ ఏడడుగులు వేశారు.
ఇలా పెళ్లి తర్వాత ఈ జంట కర్నూలుకు చేరుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు.
ఇకపోతే మౌనిక మనోజ్ పెళ్లి విషయంలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించారని విషయం మనకు తెలిసిందే.ఈమె దగ్గరుండి తన తమ్ముడి ప్రేమను గెలిపించారని తెలుస్తోంది.ఇకపోతే మంచు లక్ష్మి చేతులు మీదుగా మనోజ్ మౌనికల వివాహం తన నివాసంలోనే అది కొద్ది మంది సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇకపోతే మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.ఇదివరకే మెహందీ వీడియోని షేర్ చేసిన మంచు లక్ష్మి తాజాగా మనోజ్ మౌనికల పెళ్లి వీడియోని కూడా షేర్ చేశారు.
మనోజ్ పెళ్లి వేడుకలలో మధురమైన క్షణాలను ఈమె ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రూపంలో షేర్ చేశారు.ఇందులో భాగంగా మంచు లక్ష్మి దగ్గరుండి తన తమ్ముడిని పెళ్లి కొడుకుగా తయారు చేశారు.అలాగే మౌనికను పెళ్లికూతురిని చేసి తీసుకువచ్చారు.ఇక ఈ వీడియోలో మనోజ్ తమ తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఇలా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైన క్షణాలు రావడంతో మనోజ్ మౌనికల మొహంలో సంతోషం విల్లు విరిసింది.ఇలా వీరి పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.