హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు సాయం చేసిన మెగా బ్రదర్.. మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటంటే?

ఈ మధ్య కాలంలో మంచు విష్ణు హెయిర్ డ్రెస్సర్ అయిన నాగశ్రీను పేరు వార్తల్లో ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే.5 లక్షల రూపాయల విలువైన వస్తువులను నాగశ్రీను దొంగతనం చేశాడని మంచు విష్ణు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగశ్రీను పేరు వెలుగులోకి వచ్చింది.అయితే నాగశ్రీను మాత్రం తాను దొంగతనం చేయలేదని తనను కులం పేరుతో దూషించారని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

 Manchu Family Effect Nagababu Helps Nagasrinu Details Here , Manchu Family , N-TeluguStop.com
Telugu Apollo, Hairdresser, Manager, Manchu, Artist, Nagababu, Nagasreenu-Movie

అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు నాగశ్రీనుకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.నాగశ్రీను గురించి వైరల్ అయిన వార్తలను విని అతని తల్లి ఆరోగ్యం క్షీణించింది.ఈ విషయం తెలిసి నాగబాబు నాగశ్రీనుకు సాయం చేశారని సమాచారం అందుతోంది.

అపోలో ఆస్పత్రి సహకారంతో నాగశ్రీను ఫ్యామిలీకి ఉచితంగా మెడికల్ చెకప్ అందేలా నాగబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది.నాగబాబు సాయం చేయడంపై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగశ్రీనుకు నాగబాబు సాయం చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే మంచు ఫ్యామిలీపై నెగిటివ్ కామెంట్లు చేయడం వల్లే నాగశ్రీనుకు నాగబాబు సాయం చేశారని కొంతమంది భావిస్తున్నారు.

నాగబాబు చేసిన సహాయం గురించి మంచు కుటుంబం తరపు పీఆర్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తమ సంస్థ నుంచి ప్రతి నెలా నాగశ్రీనుకు సరిగ్గానే వేతనాన్ని డిపాజిట్ చేస్తున్నామని పీఆర్ అన్నారు.

Telugu Apollo, Hairdresser, Manager, Manchu, Artist, Nagababu, Nagasreenu-Movie

గత నెల వేతనం కూడా అదే విధంగా నాగశ్రీను ఖాతాలో డిపాజిట్ చేశామని పీఆర్ చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.నాగబాబు చేసిన సాయంపై మంచు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube