ఒక్క సినిమా చేయకుండానే మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిందిగా!

టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేసి స్టార్స్‌తో రొమాన్స్ చేస్తే వచ్చే క్రేజ్‌ను ఒక బ్యూటీకి ఏం చేయకుండానే వచ్చి పడింది.దీంతో ఆ బ్యూటీ తనకు వచ్చిన క్రేజ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.

 Manasa Radhakrishnan New Crush Of Tollywood, Manasa Radhakrishna, Pawan Kalyan,-TeluguStop.com

అయితే తనకు సినిమా ఆఫర్లు వస్తే కూడా బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో బలంగా కోరుతున్నారు.

దీనికి కారణంగా ఈమె తమ దేవుడు పవన్ కళ్యాణ్ సరసన నటించనుందనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ కావడమే.

పవన్ కళ్యాణ్‌తో కలిసి గబ్బర్‌సింగ్ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ మరో సినిమా చేయనున్నాడు.

పవన్ 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తానని హరీష్ శంకర్ చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మానసా రాధాకృష్ణన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో రావడంతో ఫ్యాన్స్ ఆమె ఫోటోలను తెగ వైరల్ చేశారు.

అయితే హరీష్ శంకర్ ఈ సినిమాలో ఆమె నటించడం లేదని చెప్పడంతో ప్రేక్షకులు ఆమెకు మంచి అవకాశం వస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.ఏదేమైనా టాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయకుండానే తనకు లభించిన క్రేజ్‌ను చూసి సంతోషంగా ఉంది ఈ మలయాళ బ్యూటీ.

ఇక తనకు మంచి ఆఫర్ లభిస్తే తెలుగులో ఖచ్చితంగా నటిస్తానని ఆమె అంటోంది.మరి మానసా రాధాకృష్ణన్‌కు తెలుగులో బ్రేక్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube