ఈ వృద్ధుడికి ఆడోళ్లంటే చచ్చేంత భయం.. ఇంటి చుట్టూ పెద్ద కంచె నిర్మించుకున్నాడు..!

రువాండా( Rwanda )కు చెందిన 71 ఏళ్ల వ్యక్తికి ఓ విచిత్రమైన, విపరీతమైన భయం పట్టుకుంది.అతను స్త్రీలను చూస్తే చాలా భయపడతాడు.

 Man So Terrified Of Women He Barricaded Himself In House 55 Years Ago,rwanda,afr-TeluguStop.com

అతడి ఒంటి నిండా చెమటలు పట్టేస్తాయి.ఊపిరి కూడా పీల్చుకోలేడు.

గుండె వేగంగా కొట్టుకుంటుంది.అందుకే ఇతడు ఆడోళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా ఏకంగా 55 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాడు.

అతను తన ఇంటి చుట్టూ 15 అడుగుల కంచెను కూడా నిర్మించాడు.తన ఆస్తిలో ఏ స్త్రీ ప్రవేశించకుండా చూసుకోవడానికి లోపల ఉండి డోర్కు తాళం వేసుకున్నాడు.

అతను ఒక ఇంటర్వ్యూలో, “ఇంటి లోపల నన్ను నేను లాక్ చేసుకుని, నా ఇంటి చుట్టూ కంచె వేయడానికి కారణం మహిళలు నా దగ్గరికి రాకుండా చూసుకోవడమే” అని అన్నాడు.మహిళను చూసినప్పుడల్లా భయంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.

Telugu Africa, Gynophobia, Rwanda-Latest News - Telugu

ఆడవాళ్ళంటే భయం( Terrified of Women ) ఉన్నా వారి మీదే ఆధారపడి బతుకుతున్నాడు.స్థానిక మహిళలు, ముఖ్యంగా అతని ఇరుగుపొరుగు వారు అతనికి ఆహారం, కిరాణా సామాను తెచ్చేవారు.అతను చిన్నప్పటి నుంచి తన ఇంటిని వదిలి వెళ్ళడం అసలు చూడలేదని అతని పొరుగు ఆడవారిలో ఒకరు చెప్పారు.తనకు కావాల్సిన వస్తువులను ఇంట్లోకి విసిరేస్తే తీసుకుంటాడని చెప్పారు.

ఎవరితోనూ మాట్లాడాడని, ఎవరూ దగ్గర ఉండకూడదని అనుకుంటాడని వెల్లడించారు.పొరపాటున ఎవరైనా మహిళ అతని కంచె( Fence ) దగ్గరికి వస్తే చాలు, అతను తన ఇంట్లోకి పరుగెత్తి తలుపు తాళం వేసుకుంటాడట.

Telugu Africa, Gynophobia, Rwanda-Latest News - Telugu

ఈ వృద్ధుడు గైనోఫోబియా( Gynophobia ) అనే మానసిక స్థితితో బాధపడుతున్నాడని కొందరు అంటున్నారు, అంటే అకారణంగానే మహిళలను చూసి భయపడే ఒక మానసిక డిసార్డర్.గైనోఫోబియా అధికారికంగా మానసిక రుగ్మతగా గుర్తించబడలేదు, అయితే ఇది క్లినికల్ సెట్టింగ్లలో ఒక రకమైన నిర్దిష్ట భయంగా పరిగణించబడుతుంది.ఏది ఏమైనా ఈ ఆఫ్రికా వ్యక్తి భయం గురించి తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube