బంగారం స్మగ్లింగ్, మరేవైనా వస్తువుల స్మగ్లింగ్‌ను మనం ఇప్పటి వరకు చూశాం, విన్నాం కాని మొదటి సారి ఒక వ్యక్తి కండోమ్స్‌ను స్మగ్లింగ్ చేయడం జరిగింది.ఇతడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 కండోమ్స్‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.
అతడు మామూలుగా ఈ కండోమ్స్‌ను తీసుకు వెళ్లడం లేదు.ఎవరికి అనుమానం రాకుండా తన కడుపులో దాచుకుని మరీ వచ్చాడు.
ఇతడి అతి తెలివితో అక్కడ పోలీసులు కూడా అవాక్కయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 49 ఏళ్ల ఒక వ్యక్తి ఈజిప్ట్‌కు వెళ్లేందుకు వచ్చాడు.అక్కడ అతడి ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో పోలీసులు అతడిని చెక్ చేశారు.
అతడి వద్ద ఎలాంటి అనుమానితంగా కనిపించలేదు.కాకుంటే కడుపు కాస్త పెద్దగా ఉండటంతో అనుమానం వచ్చింది.
కడుపును కదిలించిన సమయంలో అనుమానం కలిగేలా ఆ వ్యక్తి ప్రవర్తించాడు.దాంతో పోలీసులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
పోలీసుల సూచనతో అతడి కడుపుకు ఎక్స్ రే తీయగా షాకింగ్ విషయం వెళ్లడయ్యింది.

అతడి కడుపులో కండోమ్స్ ఉన్నాయి.ఆ కండోమ్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 ఉన్నాయి.డాక్టర్లు ఆ కండోమ్స్‌ను బయటకు తీశారు.
మొత్తం 80 కండోమ్స్‌ను అతడు మింగాడు.అతడు మింగిన కండోమ్స్ కడుపులో చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.
కండోమ్స్‌ను ఈజిప్ట్‌కు తీసుకు వెళ్తున్నట్లుగా ఒప్పుకున్నాడు.అక్కడ కండోమ్స్‌కు ఇబ్బందిగా ఉన్న కారణంగానే తాను ఇలా కండోమ్స్ స్మగ్లింగ్‌ను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
అతడి సమాధానంకు పోలీసులు అవాక్కయ్యారు.దుబాయి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.తాజాగా అతడికి దుబాయి కోర్టు శిక్ష కూడా విధించింది.10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష దీనార్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 20 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది.దుబాయిలో శిక్షలు కఠినంగా ఉంటాయనే విషయం తెల్సిందే.తాజాగా ఆ విషయం ఈ సంఘటనతో వెళ్లడయ్యింది.