ప్రముఖ నటుడు కి కరోనా పాజిటివ్...!

ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ కి కరోనా సోకినట్లు తెలుస్తుంది.ఇటీవల ఆయన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.

 Malayalam Actor Prithviraj Tested Covid-19 Positive , Malayalam Actor, Pruthvi R-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడం తో హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాలు అనుమతి ని ఇవ్వని సంగతి తెలిసిందే.

దీనితో చాలా మంది నటులు ఇళ్లకే పరిమితమైపోతున్నారు.అయితే ఇటీవల కేంద్ర సర్కార్ లాక్ డౌన్ నిబంధనల సడలింపులు కల్పించడం తో షూటింగ్ లు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే నటుడు పృథ్వీరాజ్ జన గణ మన అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ మూవీ షూటింగ్ ఎర్నాకులం లో ప్రారంభం కాగా ఈ క్రమంలోనే ఆయన షూటింగ్ నిమిత్తం అక్కడకి వెళుతున్నారు.అయితే కేరళ లోని ఎర్నాకులం లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నటుడు పృథ్వీరాజ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ మూవీ దర్శకుడు డీజో జొస్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ కావడం తో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ఈ టీమ్ లో దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ తో పాటు సూరజ్ వెంజరమోదు కూడా పాల్గొనగా ఆయన ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది.

అయితే కరక్ట్ గా లాక్ డౌన్ కు ముందు ఆడు జీవితం అనే మూవీ షూటింగ్ కోసం జోర్దాన్‌కి పృథ్వీరాజ్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం తో ఆ టీమ్ మొత్తం కూడా దాదాపు రెండు నెలల పాటు సరైన ఆహరం కూడా లేకుండా నానా తిప్పలు పడాల్సి వచ్చింది.

అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో ఆ టీమ్ మొత్తం ఇక్కడకు తిరిగి రాగా, ఆ తరువాత జరిపిన పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినప్పటికీ నటుడు పృథ్వీ రాజ్ కు మాత్రం నెగిటివ్ గానే నిర్ధారణ అయ్యింది.అయితే ఇప్పుడు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ తేలడం తో ప్రస్తుతం హోం క్వారంటైన్ లోనే ఉంటున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube