ఏంటి ? రెండు లక్షలా? అది కూడా ఒక హెయిర్ స్టెయిల్ కి ? ఎందుకు బాబు అంత ఖర్చు? అసలు అంత ఖర్చు పెట్టిన స్టార్ హీరో ఎవరు నాయనా? అని మీకు డౌట్ వచ్చింది కదా! అతడు ఎవరో కాదు మహేష్ బాబు.ఎంత మహేష్ బాబు అయితే మాత్రం చెరిపితే చెదిరిపోయే హెయిర్ కి.కట్ చేస్తే కట్ అయ్యే హెయిర్ కి రెండు లక్షలా? అంతా అవసరమా అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.కానీ స్టార్ హీరో హెయిర్ స్టేయిల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా!
నిజానికి మహేష్ బాబుకు 45 ఏళ్ళ వయసు వచ్చిన ఇప్పటికి 20 ఏళ్ల యువకుడిలా ఉంటాడు.
ఇటీవల మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసే ఫొటోస్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి ఎంతో యాంగ్ గా కనిపిస్తూ ఈ తరం జెనరేషన్ కి ఆహా అనేలా కనిపిస్తుంటారు మహేష్ బాబు.
ఇకపోతే తాజాగా నటిస్తున్న ”సర్కార్ వారి పాట” సినిమాలో ఎంతో యాంగ్ గా కనిపిస్తూ అందరిని అలరించనున్నారు.

అయితే ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లే మహేష్ బాబు కరోనా వైరస్ వల్ల ఎన్నో నెలల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు.అయితే ఇప్పుడు కరోనా తగ్గుతున్న కారణంగా మహేష్ బాబు కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.అయితే అలా కుటుంబంతో పాటు వెళ్లిన మహేష్ బాబు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ ఫోటోలో మహేష్ బాబు హెయిర్ స్టెయిల్ చాలా డిఫరెంట్ గా ఉంది.గాగుల్స్ పెట్టుకొని డిఫరెంట్ గా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ హెయిర్ స్టెయిల్ ఫారెన్ లో చేయించుకున్నట్టు దీనికి ఏకంగా 2 లక్షల రూపాయిలు ఖర్చు పెట్టినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఏది ఏమైనా.ఎంత ఖర్చు పెట్టిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.