ప్రతి రోజు ఎన్నో రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి.కాని కొన్ని రికార్డుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనిపిస్తుంది.
ఎందుకంటే ఆ రికార్డులు అత్యంత ప్రత్యేకంగా నమోదు అవుతాయి.అలా ఎలా నమోదు అయ్యాయో అనే విషయం అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో నమోదు అయ్యే రికార్డులు ఎక్కువగా స్టార్ హీరోల మద్య ఉంటుంది.కాని ఈ రికార్డు మాత్రం ఇద్దరు యంగ్ హీరోల మద్య దోబుచులాడి చివరకు ఇద్దరు కూడా టాప్ లో నిలిచి మొదటి స్తానంను షేర్ చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా తెలుగులో ఆకట్టుకోలేక పోయినా హిందీలో డబ్ అయ్యు యూట్యూబ్ లో విడుదల అయ్యి 24 గంటల్లో 11 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఏ తెలుగు సినిమా కూడా హిందీలో డబ్ అయ్యి మొదటి 24 గంటల్లో కోటికి పైగా వ్యూస్‌ను దక్కించుకున్న దాఖలాలు లేవు.కాని ఈ సినిమా మాత్రం ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రికార్డును సాయి ధరమ్ తేజ్ కూడా షేర్ చేసుకున్నాడు.
ప్రతి రోజు పండుగే సినిమాను హిందీలో హర్ దిన్ దీవాళి అంటూ హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లారు. యూట్యూబ్‌లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వెళ్లిన హిందీ వర్షన్ ప్రతి రోజు పండుగే సినిమా ఏకంగా 24 గంటల్లో 11 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
కాస్త అటు ఇటుగా ఇద్దరు ఒకే సమయంలో ఈ రికార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.హిందీ ప్రేక్షకులు మరింతగా హర్ దిన్ దీపాళి సినిమాను చూస్తున్నారు.
చూస్తుంటే కొన్ని రోజుల్లోనే 100 మిలియన్ ల వ్యూస్‌ను దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.తెలుగు సినిమాలు వంద మిలియన్ ల వ్యూస్ ను రాబట్టడం అనేది చాలా కామన్ అయ్యింది.