సుధీర్ బాబు కొడుకులు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా..?

టాలీవుడ్ సినీ నటుడు, ఘట్టమనేని కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు పరిచయం గురించి అందరికీ తెలిసిందే.2010లో ఏం మాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ప్రేమ కథ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు కూడా అందగా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు సుధీర్.

 Mahesh Babu Sister Priyadarshini Sudheer Babu Family Pics Viral, Mahesh Babu, Su-TeluguStop.com

ఇక సుధీర్.మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక వీరికి చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇప్పటివరకు సుధీర్ తన కుటుంబాన్ని పరిచయం చేయకపోగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన కుటుంబం తో దిగిన ఫోటోను పంచుకున్నారు.

సుధీర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను మాత్రమే పంచుకుంటాడు.

కానీ తాజాగా తన ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అందులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన సుధీర్ కుటుంబం ను చూసి సుధీర్ కు ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.తన ఇద్దరు కొడుకులు ఎంతో క్యూట్ ఉండగా చిన్న కొడుకు దర్శన్ మాత్రం తన మేనమామ మహేష్ బాబు పోలికలతో ఉన్నట్లు అనిపిస్తుంది.

Telugu Charith Manas, Darshan, Mahesh Babu, Priyadarshini, Sudheer Babu-Movie

ఇక అభిమానులు కూడా ఆ విషయాన్నే పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సుధీర్ బాబు నానితో కలిసి ‘వి‘ సినిమాలో నటించగా.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.ఇక ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లోనే మరో ప్రేమకథ సినిమాలో నటిస్తున్నాడు.అంతే కాకుండా మరో మాస్ సినిమాల్లో కూడా చేస్తున్నాడు.పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube