సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మే 12వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

 Mahesh Babu Sarkaaru Vaari Paata Movie Pre Release Event News, Flim News, Keerth-TeluguStop.com

మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటాయి అంటున్నారు.ఇద్దరు చాలా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల కావడంతో ఇక జనాలు సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మే 7వ తారీకున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు.

ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ను యూసుఫ్‌ గూడ పోలీస్ లైన్స్ లో నిర్వహించబోతున్న తెలుస్తోంది.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parashu Ram, Sarkaaruvaari-Movie

ఇటీవల పెద్ద హీరోల సినిమాలు దాదాపు అన్నీ కూడా యూసఫ్ గూడ పోలీస్ లైన్స్‌ లోనే జరుగుతున్నాయి.కనుక మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కు కూడా అక్కడే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది.ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరూ హాజరు కాబోతున్నారు అనే విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

మహేష్‌ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక కి మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే.ఆ సమయంలో చిరంజీవి మరియు విజయశాంతి మద్య జరిగిన సరదా సంఘటనలు వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎవరు పాల్గొంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube