Guntur Kaaram OTT : అఫీషియల్: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం గుంటూరు కారం( Gunturu Kaaram ) ఈ సినిమా జనవరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మిక్స్డ్  టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంది.

 Mahesh Babu Gunturu Kaaram Ott Release Date Lock-TeluguStop.com

మహేష్ బాబు మీనాక్షి చౌదరి శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix)కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు మలయాళ హిందీ కన్నడ భాష హక్కులను కూడా కొనుగోలు చేశారు.థియేటర్లో జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా నెలరోజులు కూడా కాకుండానే ఓటీటీలో( Gunturu Kaaram OTT ) ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమైంది.

ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో నటించినటువంటి ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం.ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే.

ఇటీవల ఈ పాట ఫుల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.గుంటూరు కారం సినిమా పూర్తి కావడంతో మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli )సినిమా పనులలో బిజీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube