Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డ్యూయల్ రోల్స్ చేసారు….ఆ చిత్రాలేమిటో అస్సలు ఊహించలేరు?

ఇండియా లోనే మోస్ట్ ఛరిస్మాటిక్ యాక్టర్ మహేష్ బాబు.( Mahesh Babu ) చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి, హీరోగా మంచి స్టార్డం సంపాదించాడు మహేష్ బాబు.

 Mahesh Babu Dual Role Movies Nani Movie Koduku Diddina Kapuram Movie-TeluguStop.com

లెజెండరీ యాక్టర్ సువర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గారి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ అతి తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు.ఒక వైపు నిమాలు చేస్తూనే మరో వైపు వాణిజ్య చిత్రాలలో కూడా నటిస్తూ సందడి చేస్తుంటాడు ఈ హ్యాండ్సమ్ హీరో.

Telugu Ameesha Patel, Kodukudiddina, Mahesh Babu, Nani, Krishna, Tollywood, Vija

మహేష్ బాబు ఇప్పటి వరకు తన సినీ ప్రస్థానంలో 36 చిత్రాలలో నటించారు.ఒక వైపు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటిస్తుంటారు మహేష్.ఆ కోవకు చెందినవే ఆయన నటించిన నాని,( Nani ) టక్కరి దొంగ,( Takkari Donga ) వన్ నేనొక్కడినే చిత్రాలు.ఐతే ఇప్పుడు మనం ప్రస్తావించదగ్గ విష్యం ఏమిటంటే మహేష్ ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలలో మాత్రమే ద్విపాత్రాభినయం( Dual Roles ) చేసారు.

ఆయన బాలనటుడిగా చేసిన చిత్రం “కొడుకు దిద్దిన కాపురం”.( Koduku Diddina Kapuram ) ఈ చిత్రం 1989 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కృష్ణ, విజయ శాంతి కలిసి నటించిన ఈ చిత్రానికి కృష్ణ గారే స్వయంగా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రమోద్, వినోద్ అనే అన్నదమ్ముల పాత్రలలో ద్విపాత్రాభినయం చేసారు.

Telugu Ameesha Patel, Kodukudiddina, Mahesh Babu, Nani, Krishna, Tollywood, Vija

మహేష్ ద్విపాత్రాభినయం చేసిన రెండో చిత్రం నాని.( Nani Movie ) ఈ చిత్రం 2004 లో విడుదలయింది.ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అమీషా పటేల్( Ameesha Patel ) హీరోయిన్ గా నటించింది.ఎస్.జె సూర్య దర్శకత్వం వహించారు.ఇది ఒక కామెడీ సైన్స్ ఫిక్షన్ చిత్రం.ఈ చిత్రం క్లైమాక్స్ లో మహేష్ బాబు కాసేపు, తండ్రీకొడుకులుగా, డబల్ రోల్ చేసారు.ఏదేమైనా…సుమారు 40 ఏళ్ళ సినీ ప్రయాణంలో మహేష్ బాబు కేవలం రెండు చిత్రాలలో మాత్రమే డ్యూయల్ రోల్ చేయడం కాస్త ఆశ్చర్యపడాల్సిన విషయమే.మరి తెలుగు హీరోలలో అత్యధిక మార్లు డ్యూయల్ రోల్ చేసిన హీరో ఎవరో తెలుసా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube