ఇండస్ట్రీలో రాణించడానికి టాలెంట్ ఉంటే చాలు.ఒక్కసారి క్లిక్ అయితే దశ తిరిగినట్టే.
మరి ఈ మధ్య మన టాలీవుడ్ లో చాలా మంది యంగ్ బ్యాచ్ పరిచయం అయ్యారు.తాజాగా మన టాలీవుడ్ లోకి మరో యంగ్ బ్యాచ్ తమ అదృష్టం పరీక్షించు కోవడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ యంగ్ బ్యాచ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నర్నె నితిన్ ( Narne Nithin )కూడా ఉన్నాడు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్( Sangeeth Shobhan ), రామ్ నితిన్ లు హీరోలుగా గౌరీ ప్రియా, అనంతిక, గోపిక ఉదయన్ హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఫుల్ మూవీ ”మ్యాడ్( MAD Movie )”.ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా ప్రమోషనల్ కంటెంట్ తోనే హైప్ క్రియేట్ చేసుకుంది.
ఇక ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వగా మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకుంది.
సినిమా ఆద్యంతం ఫన్ అండ్ హిలేరియస్ టాక్ అందుకుంది.అంతా కొత్త నటీనటులు అయినప్పటికీ యువ నటులంతా తమ సహజమైన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టు కున్నారు.అలాగే కామెడీతో కూడా కడుపుబ్బా నవ్వించి ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన భావన కలిగేలా చేసారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు.ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.రఘుబాబు, కేవీ అనుదీప్ తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
దీంతో థియేటర్స్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.