రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ను రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య , సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ ఆయాజ్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం , స్థానిక కౌన్సిలర్ రెడ్యా నాయక్ లతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు.
వారితో కలిసి టిఫిన్ చేశారు.రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అరకొర వసతులతో ఉండేవన్నారు.కనీస మౌలిక సదుపాయాలు ఉండేవికావన్నారు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ బడుల దశ, దిశ మారిందన్నారు.సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన బోధన, మౌలిక వసతులపరంగా బలోపేతం అయ్యాయని తెలిపారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన తో అనేక మంది తిరిగి ప్రభుత్వ బడి బాట పట్టారన్నారు.విద్యార్థుల అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నారు.
తెలంగాణలో సిఎం కేసిఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ… రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నారని తెలిపారు తెలంగాణలో పుట్టడం మన అందరి అదృష్టమని ఆమె అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ వేములవాడ ,సిరిసిల్ల నియోజకవర్గం లోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా చూడడం, హాజరు పెంపు , సంతులిత పోషకాహారం విద్యార్థులకు అందుతుందన్నారు.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యంలో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనేక పాఠశాలలో డైనింగ్ హాల్ ల నిర్మాణం కూడా చేసుకున్నామని తెలిపారు.
ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు త్వరలోనే ఈ పథకం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం వర్తింపజేయనుందని తెలిపారు.
రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ…స్వరాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు.
ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీపడేలా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల బోధనను అందజేస్తుందన్నారు.అలాగే పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు సీఎం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా ప్రగతిని కోరుకుంటుండగా, మంత్రి కే తారకరామారావు విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు పెంపుదలకు కృషి చేస్తున్నారన్నారు.
ఒకప్పుడు హై స్కూల్ కు కూడా లేని రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఇప్పుడు నలు దిక్కులా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ కీర్తి పతాకను విద్యార్థులు ప్రపంచవ్యాప్తం చేయాలని ఆయన కోరారు.మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం అని తెలిపారు.
తాము చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం పాఠశాలలో దొడ్డు రవ్వ పెట్టేవారని….ఇప్పుడు సిఎం కేసిఆర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు.ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు .స్వరాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం స్థానిక ప్రజాప్రతినిధులం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.