కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' నుండి మూడవ సింగిల్ 'బావ తాకితే' లిరికల్ వీడియో విడుదల

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు.గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది.

 Lyrical Video From Kiran Abbavaram’s Sammathame Unveiled , Kiran Abbavaram ,-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి.

ఈ రోజు ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే‘ అనే పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు.80లో రెట్రో స్టయిల్లో చిత్రీకరించిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
♪♪ చిటపట చినుకులు కురిసెనులే
యదలో అలజడి రేగే
పడిపడి తపనలు తడిసెనులే
తనువే తహతహలాడే ♪♪

అంటూ సాగిన సాహిత్యం, విజువల్స్, కాస్ట్యుమ్స్, మ్యూజికల్ బ్యాకింగ్ ఇలా అన్నీ రెట్రో స్టయిల్ ని అందంగా ప్రజంట్ చేశాయి.సనాపతి భరద్వాజ పాత్రుడు పాటకు సాహిత్యం అందించగా .గాయకులు మల్లికార్జున్, మాళవిక పాటని శ్రావ్యంగా ఆలపించారు.సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర రెట్రో స్టయిల్ లో స్వరపరిచిన ఈ పాట కన్నుల పండగలా వుంది.

యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సమ్మతమే’ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube