మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ రద్దు చేయడంపై వైసీపీ పై లోకేష్ సీరియస్..!!

టీడీపీ యువనేత నారా లోకేష్ ( Nara Lokesh )వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ పోస్ట్ పెట్టారు.ప్రతి ఏడాది పద్ధతి ప్రకారం జరిగే ఎంసెట్ మూడవ విడత కౌన్సిలింగ్ ఏపీ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మండిపడ్డారు.

 Lokesh On Ycp Is Serious About Canceling The Third Round Of Emcet Counselling ,-TeluguStop.com

దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు.తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సీఎం జగన్ కి లెటర్ రాసినట్లు ఈ పోస్టులో తెలియజేశారు.నారా లోకేష్ ట్విట్టర్ లో ఎంసెట్ కి సంబంధించిన పోస్ట్.”ప్ర‌తి ఏటా ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రిగే ఎంసెట్ 3వ విడ‌త కౌన్సెలింగ్ ఏపీ స‌ర్కారు ర‌ద్దు చేయ‌డంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని, త‌క్ష‌ణ‌మే కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి( YS Jagan Mohan Reddy ) లేఖ రాశాను.

త‌మకి ద‌గ్గ‌ర‌లో, కోరుకున్న బ్రాంచి వ‌స్తుంద‌ని నిరీక్షిస్తున్న విద్యార్థుల‌కి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ( Minister Botsa Satyanarayana ) కౌన్సెలింగ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌గించారు.ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఎగ‌వేసి, సీట్లు అమ్ముకునేందుకే 3వ విడ‌త కౌన్సెలింగ్ ర‌ద్దుచేసి స్పాట్ అడ్మిష‌న్ల‌కి తెర‌లేపారు.3వ విడ‌త కౌన్సెలింగ్ ర‌ద్దుతో విద్యార్థులు పాల్ప‌డుతున్న ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌కు స‌ర్కారుదే బాధ్య‌త‌.త‌క్ష‌ణ‌మే ఎంసెట్ 3వ విడ‌త కౌన్సెలింగ్ ప్ర‌క‌టించి విద్యార్థుల‌కి న్యాయం చేయాలి” అని లోకేష్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube