ఈ సీజన్ బిగ్ బాస్ షో ( Bigg Boss Show )అన్నీ విధాలుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.టాస్కుల పరంగా కానీ, కంటెస్టెంట్స్ ఆట తీరు పరంగా కానీ వేరే లెవెల్ కి వెళ్ళింది అనే చెప్పాలి.
అంతే కాదు హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా, వాళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని భావోద్వేగాలు ఆడియన్స్ మనసుల్ని కదిలించింది అనే చెప్పాలి.ప్రస్తుతం చివరి వారం నడుస్తుండగా, టాప్ 6 కంటెస్టెంట్స్ గా అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్ మరియు అర్జున్ నిలిచారు.
గ్రాండ్ ఫినాలే కి కేవలం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలి కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఒకరిని బయటకి పంపిస్తారని అంటున్నారు కానీ, దీని గురించి హోస్ట్ నాగార్జున ( Nagarjuna )నుండి ఎలాంటి ప్రకటన మొన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో రాలేదు.ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అర్జున్ లేదా యావర్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.

ఇదంతా పక్కన పెడితే వీరిలో కేవలం అమర్ దీప్ , పల్లవి ప్రశాంత్ మరియు శివాజీలలోనే ఎవరికో ఒకరికి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ శివాజీ( Shivaji ) మీద భారీ మార్జిన్ తో లీడింగ్ లో ఉన్నారట.కేవలం టాప్ 2 కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు కోట్ల ఓట్లు నమోదు అయ్యాయి అట.ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక రికార్డు అని అంటున్నారు.ఈ రేంజ్ లో ఓటింగ్ ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా జరగలేదట.గత సీజన్ లో అయితే కేవలం రెండు కోట్ల ఓటింగ్స్ మాత్రమే నమోదు అయ్యాయి అట.ఆ రెండు కోట్ల ఓటింగ్స్ లో ప్రతీ ఒక్కరికి ఒక్కో కంటెస్టెంట్ కి పది ఓట్లు వేసే అవకాశం ఉండేది.కానీ ఈసారి మాత్రం కేవలం ఒక్క ఓటు, ఒక్క మిస్సెడ్ కాల్ ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారట.

అయితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి బిగ్ బాస్ టీం కూడా అంచనా వెయ్యలేని పరిస్థితి అట.ఎందుకంటే కాసేపు అమర్ దీప్ ( Amar Deep )లీడింగ్ లో ఉంటే కాసేపు పల్లవి ప్రశాంత్ లీడింగ్ లో ఉంటున్నాడట.కాబట్టి గెలుపు ఎవరిదీ అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ అట.ఇప్పటి వరకు ప్రసారమైన కంటెస్టెంట్స్ AV’s లలో అమర్ దీప్ AV కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.అందువల్ల ఆయనకీ గత రెండు రోజుల నుండి ఓటింగ్ బాగా పెరిగిందట.పల్లవి ప్రశాంత్ AV పూర్తి అయ్యాక అతని ఓటింగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.