నిన్నటి తరం నటి అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు.
కేవలం డాన్సర్ గా మాత్రమే కాకుండా పలు మలయాళ సినిమాలలో హీరోయిన్ పాత్రలో కూడా ఎంతో అద్భుతంగా నటించింది.అదే విధంగా చిరంజీవి నటించిన “మగమహారాజు” చిత్రంలో తన భర్తను బతికించుకోవడం కోసం తన ఒంటిని అమ్ముకోవడానికి సిద్ధపడే మహిళ పాత్రను ఎంతో అద్భుతంగా చూపించారు.
ఇలా వెండి తెరపై ఒక శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన ఈమె నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ సతీష్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది.
ఇద్దరు డ్యాన్సర్లు కావడంతో వీరి మధ్య ఎంతో చనువుగా పరిచయం ఉండేది.అయితే ఇద్దరు చనువుగా ఉన్నారంటే వారి గురించి వచ్చే వార్తలు ఏస్థాయిలో మనుషులను కృంగదీస్తాయో తెలిసిందే.
ఇలా వీరిద్దరి గురించి లేనిపోని వార్తలను సృష్టించే వారికి లేని భావనను కలిగించారు.ఇలా ఇండస్ట్రీ మొత్తం తమ గురించి గుసగుసలు మాట్లాడుతుంటే ఇక చేసేదేమీ లేక అనురాధ సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
ఇలా పెళ్లి చేసుకొని తొమ్మిది సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వీరు జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది.

సతీష్ ఒక బైక్ ప్రమాదానికి గురైనప్పుడు అతని తలకు బలమైన గాయం తగిలింది.డాక్టర్లు కూడా చేతులెత్తేసారు.ఈ క్రమంలోనే తన భర్తను కూడా ఒక చంటి బిడ్డను చూసుకున్నట్లు అనురాధ అతనికి ఎన్నో సేవలు చేసింది.
తన భర్త వైద్యం కోసం సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి తన భర్తను బతికించుకోవాలని ఆరాటపడింది.ఈ క్రమంలోనే ఒకరోజు తన భర్తకు భోజనం తినిపిస్తూ ఉండగా పొలమారడంతో వెంటనే సతీష్ తన భుజాల పై వాలి కన్నుమూశారు.
ఇలా తన భర్త ప్రమాదానికి గురైన 11 సంవత్సరాలపాటు తనని చంటి బిడ్డను చూసుకున్న అనురాధ ఎంత దయాగుణరాలో అర్థం చేసుకోవచ్చు.