తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Telangana Speaker Gaddam Prasad Kumar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత పదేళ్లలో శాసనసభ( Legislative Assembly) సరిగా నిర్వహించలేదని తెలిపారు.
శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలిసేది కాదని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని వెల్లడించారు.
కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారని తెలిపారు.పిల్లలు సైతం శాసనసభ సమావేశాలపై చర్చించుకుంటున్నారని వెల్లడించారు.