తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సీపీఎంల( CPI CPM ) పరిస్థితి ఏమిటనేది ఇంకా గందరగోళంగానే ఉంది.కాంగ్రెస్ ( Congress )తో ఈ రెండు పార్టీలకు పొత్తు ఖరారైన, సీట్ల విషయంలో మాత్రం ఇంకా పేచి నడుస్తోంది .సిపిఐ , సిపిఎం పార్టీలు కోరిన సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ వెనకడుగు వేస్తూ ఉండడంతో వామపక్ష పార్టీల పరిస్థితి ఏమిటి అనేది తేలాల్సి ఉంది .చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను తమకు కేటాయించాలని కోరుతూ ఉండగా , సిపిఎం వైరా, మిర్యాలగూడ సీట్లను కోరుతోంది .అయితే ఆ సీట్లను కేటాయించే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది .ఈ నేపథ్యంలోని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క( Mallu Bhatti Vikramarka )తో లెఫ్ట్ పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు.తాము కోరిన స్థానాలను ఇవ్వాలని రెస్ట్ పార్టీలు కోరుతున్నాయి.
ఇదే విషయాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ , సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.తాము కోరిన సీట్లు లభిస్తే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని, పొత్తు ధర్మం పాటిస్తామని, లేదంటే తమ దారి తాము చూసుకుని సొంతంగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ కు హెచ్చరికలు చేస్తున్నారు. కాంగ్రెస్తో ఒత్తు కుదరకపోతే సిపిఐ , సిపిఎం కలిసి పోటీ చేస్తాయని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ( Julakanti Ranga Reddy )తెలిపారు .భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ రాకపోతే ఇక వేచి చూడమని సిపిఐ , సిపిఎంలు( CPI CPM ) కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. కనీసం రెండు పార్టీల కలిసి 30 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.
పొత్తుతో సంబంధం లేకుండా సిపిఎం పోటీ చేయాల్సి వస్తే ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా ,భద్రాచలం, పాలేరు ,ఖమ్మం, నల్గొండ ,భువనగిరి , నకిరేకల్ హుజూర్ నగర్, కోదాడ , ఆలేరు, ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేస్తామని ,సిపిఐ కూడా కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు ,దేవరకొండ, బెల్లంపల్లి, హుస్నాబాద్ తదితర 15 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు .నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కాబోతుండడంతో వామపక్ష పార్టీలు ఇక వేచి చూసే ధోరణి అవలంబించకూడదని నిర్ణయించుకున్నాయి.దీంతో లెఫ్ట్ పార్టీల విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.