సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఆ ఖర్చు,వారు వేసుకునే బట్టలు చాలా రిచ్ గానే ఉంటాయి.మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ( Mega family ) కి సంబంధించిన ఫంక్షన్స్ అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ చాలా కామన్.లక్షల్లో పెట్టి బట్టలు కొంటారు.
కాళ్లకు వేసుకునే చెప్పుల నుండి పెదాలకు పెట్టుకునే లిప్ స్టిక్ వరకు ఇలా ప్రతి ఒక్కదాన్ని చాలా రిచ్ గానే మెయింటైన్ చేస్తారు.అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య ( Varun tej,Lavanya ) పెళ్లిలో సుస్మిత వేసుకున్న డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేసింది.
చూడ్డానికి ఆ డ్రెస్ వెరైటీగా ఉన్నప్పటికీ దాని కాస్ట్ మాత్రం లక్షల్లో ఉంది.మరి సుస్మిత వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెట్టాల్సిందే.
అవును మీరు వినేది నిజమే.
సుస్మిత కొణిదెల ( Susmitha Konidela ) ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక వెరైటీ డ్రెస్ వేసుకుంది.అయితే ఆ డ్రెస్సు హైదరాబాద్లోని ఫ్యాషన్ డిజైనర్ అయిన మృణాళిని రావు డిజైన్ చేసారట.ఇక ఆ డ్రెస్ అరకులోయ లోని కొందు మహిళలు వేసుకునే డిజైన్ అని తెలుస్తోంది.
ఇక ఈ డ్రెస్ ని ఎవరా కఫ్తాన్ డ్రెస్ అని అంటారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీ లోని టస్కాన్ లో నిన్న అనగా నవంబర్ 1 మధ్యాహ్నం 2:48 గంటలకు చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇక ఇప్పటికే వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.అయితే మెహందీ ఫోటోలు, హాల్ది ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇక మెహేంది ఫంక్షన్ లో చిరంజీవి ( Chiranjeevi ) కూతురు సుస్మిత వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఖరీదు ఏకంగా 1,79,200 అని తెలుస్తోంది.
ఇక ఈ రేటు తెలిసి మీరందరూ వామ్మో అంత ఖరీదా అని అనడం మీ వంతు అవుతుంది.ఇక ఈ డ్రెస్ కి అంత కాస్ట్ ఉండడానికి ప్రధాన కారణం ఇది ప్యూర్ పట్టుతో చేసారట.
ప్యూర్ పట్టు మీద హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ కు చాలా లుక్ ఇచ్చింది.ఇక ఈ డ్రెస్ ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది.అయితే ఈ డ్రెస్ డబల్ ఎక్సెల్ అయితే మాత్రం 1,97,120 అదే 4 ఎక్సెల్ అయితే 2,15,040 రూపాయలు ధర ఉంటుందట.ఇక సుస్మిత వేసుకున్న ఖరీదే అన్ని లక్షలు ఉంటే ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.