ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే టీజర్..!

క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే.మత్తువదలరా సినిమాతో డైరక్టర్ గా తన ప్రతిభ చాటుకున్న రితేష్ రానా డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Lavanya Tripathi Happy Birthday Teaser Released Lavanya Tripathi, Happy Birthda-TeluguStop.com

రీసెంట్ గా పోస్టర్ తో సూపర్ బజ్ ఏర్పరచిన హ్యాపీ బర్త్ డే సినిమా నుండి లేటెస్ట్ గా టీజర్ రిలీజైంది.ఆయుధాల చట్టం అంటే ఏంటి సుయోధన.

ఇంటింటికి గన్, ఎదురులేని ఫన్ అంటూ టీజర్ మొదలు పెట్టి నేను టెంత్ ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ గన్ బిల్ మాత్రం పాస్ చేస్తానని కమెడియన్ వెన్నెల కిశోర్ డైలాగ్ చెబుతాడు.ఈ సినిమాలో వెన్నెల కిశోర్ మంత్రిగా కనిపించనున్నారు.

హ్యాపీ బర్త్ డే టీజర్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది.కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సరంగం కెమెరా వర్క్ చేశారు.వివేక్ ఆగస్త్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించే సబ్జెక్ట్ తో వస్తుందని చెప్పొచ్చు.జూలై 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా లావణ్య త్రిపాఠికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube