Lakshman Meesala : చిరంజీవి, అల్లు అరవింద్ ఇల్లు కట్టిన వాళ్లలో నేను ఉన్నాను : లక్ష్మణ్ మీసాల

లక్ష్మణ్ మీసాల..

 Lakshman Meesala House Construction Works For Mega Family-TeluguStop.com

( Lakshman meesala ) ఇటీవల కాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.మంగళవారం సినిమాలో( Mangalavaram Movie ) మంచి క్యారెక్టర్ పోషించి తను కూడా ఒక నటుడే అని నిరూపించుకున్నాడు.

గొప్ప క్యారెక్టర్స్ చేయగల సత్తా ఉండి కూడా చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఏ పని దొరికితే ఆ పని చేసి ఇప్పుడిప్పుడే ఈ నటుడు ఎదుగుతున్నాడు.అయితే లక్ష్మణ్ మీసాల బతకడం కోసం ఎన్నో పనులు చేశాడు.

ఒక లక్షమంటూ పెట్టుకోకుండా దొరికిన పనులు చేయడం వల్ల ఏది పూర్తిస్థాయిలో కెరియర్ గా మలుచుకోలేదు.కానీ తనలో ఒక నటుడు ఉన్నాడని గుర్తించి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించాడు.

చాలా రోజులుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇప్పుడే కాస్త నోటబుల్ పాత్రల్లో కనిపిస్తున్నాడు.

Telugu Allu Aravind, Balakrishna, Chiranjeevi, Mangalavaram, Payal Rajput, Tolly

లక్ష్మణ్ మీసాల నటనలోకి రాక ముందు ఎక్కువగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ( Building Construction )పనులు చేసేవాడట.జూబ్లీహిల్స్ లోని ఫిలిం నగర్లో ఫిలింనగర్ క్లబ్ ని కట్టిన కూలీలలో అతడు కూడా ఒకడు.ఆ సందర్భంలో తన బొటన వేలు కూడా కట్టయ్యిందట.

తన రక్తం చిందించానని ఆ తర్వాత ఫిలింనగర్ క్లబ్ ఇప్పుడు ఎంతో పేరు గడిచింది అని లక్ష్మణ్ చాలా గొప్పగా చెబుతున్నాడు.కేవలం అది మాత్రమే కాదు చిరంజీవి ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కూడా ఎన్నో రోజులు కన్స్ట్రక్షన్ పని చేశానని కానీ ఆయన్ని కలిసి అవకాశం అప్పుడు దొరకలేదంటూ చెప్పాడు.

అల్లు అరవింద్ కు సంబంధించిన రెండు ఇల్లులు కూడా కట్టడానికి ఎన్నో సార్లు కూలీ పని కోసం వచ్చానని, ఒకటి ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇల్లు కాగా మరొకటి బాలకృష్ణ ఇంటి పక్కన ఉన్న ఇళ్లు అని అందులో ప్రస్తుతం బన్నీ ఉంటున్నాడని అని లక్ష్మణ్ తెలిపాడు.

Telugu Allu Aravind, Balakrishna, Chiranjeevi, Mangalavaram, Payal Rajput, Tolly

ఇప్పుడు మంగళవారం సినిమా( Mangalavaram Movie ) ద్వారా తనని నటుడుగా అందరూ గుర్తిస్తున్నారని, సినిమా పరిశ్రమలోని కొన్ని ఇళ్లకు పని చేయడం ద్వారా అలాగే క్లబ్ కోసం పనిచేయడం ద్వారా తాను కూడా ఇండస్ట్రీకి చెందిన వాడిని అని ఒక్కోసారి గర్వంగా ఉంటుంది అని లక్ష్మణ్ ఎమోషనల్ గా తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube