రాజయ్య Vs కడియం వ్యవహారాన్ని కేటీఆర్ సెట్ చేశారా?

గత కొన్ని రోజులుగా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య రాజుకున్న రగడ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరియు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై దాడి చేసుకోవడం అధికార పార్టీకి పెద్ద తలపోటుగా మారింది.

 Ktr Settled The Matter Between Kadiyam Srihari And Rajayya-TeluguStop.com

కడియం బీసీ కులాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎస్సీ కోటాలో అధికారాన్ని అనుభవిస్తున్నారని ఆయన తండ్రి ఏ కులమో ఇప్పటివరకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం కూడా అంతే దీటుగా స్పందించారు.రాజయ్య పై వచ్చిన అనేక ఆరోపణల పై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

Telugu Brs, Kadiyam Srihari, Rajaiah, Ts-Telugu Political News

తెలంగాణ రాజకీయాల లో అనేక కీలక పదవులు నిర్వహించిన ఈ ఇద్దరు నేతలు తమ స్థాయిని మరిచి ఇట్లా వ్యక్తిగతంగా దూషించుకోవడంపై అధికార పార్టీ కార్యకర్తల కూడా ఎవరిని సమర్ధించారో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయారు.ఇప్పుడు ఈ వ్యవహారంలో కేటీఆర్( K.T.Rama Rao ) ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది.ఇద్దరి నేతలను విడిగా పిలిపించుకొని విడివిడిగా చర్చించి సర్ది చెప్పారని, తమ మధ్య విభేదాలు తొలగించుకుని కలిసి పని చేస్తామని ఇద్దరు నేతలు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి.

Telugu Brs, Kadiyam Srihari, Rajaiah, Ts-Telugu Political News

మీడియాతో మాట్లాడి రాజయ్య( T.Rajaiah) కూడా నియోజకవర్గంలో తన పని తనను చేసుకోని వెళ్ళమని కేటీఆర్ సూచించారని, ఎమ్మెల్యే టికెట్ పై అధినేత కేసిఆర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని అనవసరమైన విషయాల జోలికి పోవద్దని కేటీఆర్ తనకు చెప్పినట్లుగా రాజయ్య చెప్పుకొచ్చారు .ఇక పై కడియం శ్రీహరితో తనకు ఏ విధమైన పంచాయితీ ఉండదని నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం పని చేస్తానని రాజయ్య చెప్పడం కోస మెరుపు.ఏది ఏమైనా రచ్చకెక్కుతున్న ఈ విషయాన్ని సెటిల్ చేసి దిద్దుబాటు చర్యలు తీసుకున్న కేటీఆర్ పై పార్టీ లో హర్షం వ్యక్తం అవుతుంది.మరి ఇకపై అయినా ఈ ఇద్దరు నేతలు సహకరించుకుంటారో లేక షరా మామూలే అంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube