ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజైన ఉప్పెన సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోగా అందులో నటించిన కృతిశెట్టికి నటిగా మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో, యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కృతిశెట్టికి స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఆఫర్లు వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు ఎలాంటి వ్యక్తి కావాలో కృతిశెట్టి చెప్పకనే చెప్పేశారు.
ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కృతిశెట్టి, రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు సుధీర్ బాబు నటిస్తున్న మూవీకి సైతం ఎంపికయ్యారు.
ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
కృతిశెట్టి హీరోయిన్ గా కొన్ని సినిమాలకు ఎంపికైనట్లు ప్రచారం జరగగా తాజాగా కృతిశెట్టి స్పందించి ఆ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
తాజాగా కృతిశెట్టి అబద్ధాలు చెప్పే అబ్బాయిలు తనకు అస్సలు నచ్చరని అన్నారు.అలాంటి వాళ్లను చూస్తే తనకు చిరాకు అని వెల్లడించారు.
నిజాయితీగా ఉండేవాళ్లు, ధైర్యంగా ఉండేవాళ్లు, ముఖంపై మొహమాటం లేకుండా చెప్పేవాళ్లు తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
మరి కృతిశెట్టికి నచ్చిన వ్యక్తి దొరుకుతారో లేదో చూడాల్సి ఉంది.
మరోవైపు కృతిశెట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కృతిశెట్టి రాబోయే రోజుల్లో సొంత గొంతును వినిపిస్తారేమో చూడాల్సి ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండటం వల్ల కూడా కృతిశెట్టికి ఆఫర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో కృతిశెట్టి మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.