ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఎందుకు చేస్తా.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తన కంటటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు కృష్ణవంశీ.

 Krishna Vamsi Comments On Danger Sequel, Krishna Vamsi, Danger Movie, Danger Seq-TeluguStop.com

ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డేంజర్.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

నరేష్,స్వాతి,సాయిరాం శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఊహించిన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ డేంజర్ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 17 ఏళ్లు కావస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు.డేంజర్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించవచ్చు కదా అంటూ ఒక నెటిజన్ ట్విట్ చేయగా ఆ ట్వీట్ పై స్పందించిన.

కృష్ణవంశీ.డేంజర్ సినిమా ఫ్లాప్‌ సర్‌.

నా ఉద్దేశం ప్రకారం ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేదు.అలాంటప్పుడు ఆ సినిమాకి కొనసాగింపు ఎలా చేయగలను అని కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు.

క్రమంలోనే మరొక నెటిజెన్ మీ ఉద్దేశంలో ఫ్లాప్ అంటే ఏమిటో నాకు తెలియదు కానీ ఆ సినిమా నా మనసును దోచుకుంది అని ట్విట్ చేయగా.

Telugu Ali, Danger, Danger Sequel, Krishna Vamsi, Rahul Sipliganj, Ramya Krishna

ఆ ట్వీట్ పై స్పందించిన కృష్ణవంశీ.సినిమాపై పెట్టిన డబ్బులు కూడా నిర్మాత తిరిగి పొందలేక పోతే దానిని ఫ్లాప్ అంటారు.డబ్బే రాజ్యం అని ఏలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాడు కృష్ణవంశీ బదులు ఇచ్చాడు.

ఇకపోతే కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్,నటుడు ఆలీ, వంశీ చాగంటి, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube