శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ..!!

భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండటంతో విజృంభిస్తున్నాడు.గత ఏడాది టి20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు అనేక సంవత్సరాలు ఫామ్ లో లేక చాలా ఒత్తిడికి గురయ్యాడు.టి20 ప్రపంచ కప్ టోర్నీలో మళ్లీ ఫామ్ లో రావడం జరిగింది.దీంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ మళ్లీ విజృంభిస్తున్నాడు.

 Kohli Broke Sachin Record In The Third Odi Against Sri Lanka Details, Sachin Te-TeluguStop.com

ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ సెంచరీ చేయడం తెలిసిందే.కాగా ఈరోజు జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ మరో సెంచరీ నమోదు చేయడం జరిగింది.

ఏకంగా 166 పరుగులు చేయడం జరిగింది.దీంతో స్వదేశంలో వన్డే లలో అత్యధిక రికార్డులు క్రియేట్ చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో చేసిన సెంచరీతో స్వదేశంలో.21వ సెంచరీని పూర్తిచేయడం జరిగింది.గతంలో స్వదేశంలో వన్డే మ్యాచ్ లలో 20 సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట రికార్డు ఉండేది.

తాజాగా కోహ్లీ చేసిన సెంచరీతో ఆ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది.మొత్తంగా చూసుకుంటే వన్డే క్రికెట్ టోర్నీలో అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీ 46వ సెంచరీ చేయడం జరిగింది.ఇంకొక నాలుగు సెంచరీలు చేస్తే అనగా 50 సెంచరీలు చేస్తే సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డు కూడా కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube