Naga Chaitanya : బిగ్ స్క్రీన్ పై ఖుషి సినిమా ట్రైలర్ చూసి హర్ట్ అయిన నాగచైతన్య.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో నాగచైతన్య ( Naga chaitanya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల కాలంలో హీరో నాగచైతన్య జోరు చాలా వరకు తగ్గిపోయింది.

 Khushi Trailer On Big Screen Naga Chaitanya Hurts-TeluguStop.com

ఈ మధ్యకాలంలో అసలు నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో వినిపించడం లేదు.అలాగే నాగచైతన్య సినిమాలకు సంబంధించి కూడా ఇటువంటి అప్డేట్ లేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో నాగచైతన్య చేసిన పని గురించి ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఇంతకీ నాగచైతన్య ఏం చేశాడంటే.

కన్నడలో సూపర్ హిట్ సినిమా హాస్టల్ హుడుగారు బెకాగిద్దరే సినిమాని తెలుగులోకి బాయ్స్ హాస్టల్ పేరుతో తీసుకువస్తున్నారు.

Telugu Big Screen, Khushi, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఈ మూవీని చాయ్ బిస్కెట్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ రేపు రిలీజ్ చేయనుంది.అయితే రెండు రోజుల ముందు నుండి ప్రీమియర్స్ సందడి మొదలైపోయింది.తాజాగా ప్రసాద్స్ లో మీడియాకు ప్రీమియర్ వేశారు.

నాగ చైతన్య చీఫ్ గెస్ట్ వచ్చారు.హజంగా ఇటువంటి వాటికి చైతన్య వంటి సెలబ్రిటీలు కనిపించి వెళ్ళిపోతారు.

కాకపోతే చైతన్య కూర్చుని సినిమా చూశారు.అయితే ఇంటర్వెల్ లో ఖుషి ట్రైలర్( Khushi trailer )వేశారట.

ఖుషి సినిమా చైతన్య మాజీ భార్య సమంత సినిమా కావడంతో క్రౌడ్ లో చిన్నపాటి కలకలం.అయితే ఆపరేటర్ ఆ విషయాన్ని వెంటనే పసిగట్టి రెండు స్క్రీన్స్ కే ఆపేశారు.

ఆపేసి సలార్ టీజర్ వేశారట.

Telugu Big Screen, Khushi, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

మరి అది నచ్చక వెళ్లిపోయాడో లేక సమంత( Samantha ) టీజర్ ఆపేసినందుకు వెళ్లిపోయాడు అన్నది తెలియదు గానీ సెకండ్ హాఫ్ చూడకుండానే చైతన్య వెళ్లిపోయారట.అయితే నాగచైతన్య థియేటర్ నుంచి అలా బయటికి వెళ్లిపోవడంతో తన మాజీ భార్యను అలా చూసేసరికి ఎమోషనల్ అయ్యాడని ఆ విషయాన్ని బయట పెట్టుకోలేక ఆ విధంగా బయటికి వెళ్లిపోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయంపై ప్రస్తుతం అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇకపోతే విజయ్ దేవరకొండ సమంత కలిసిన నటించిన విడుదల 1 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube