అలా పిలిస్తే జక్కన్నకు ఎంతో ఇష్టమట.. కీరవాణి పిల్లలు రాజమౌళిని అలా పిలుస్తారా?

టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి.

 Keeravani Childrens Calling Rajamouli With That Name, Keervani, Childrens, Rajam-TeluguStop.com

బాహుబలితో ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అయ్యారు రాజమౌళి.ఇక ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

అలాగే ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిస్త్ర సృష్టించారు.రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచంలోని సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి వర్క్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అంతే సరదాగా ఉంటారని తెలిసిందే.కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ( Sri Simha ) ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా శ్రీసింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలుపుతూ రాజమౌళి గురించి కూడా మాట్లాడారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ సింహ మాట్లాడుతూ.

రాజమౌళిని బాబా( Baba ) అని పిలుస్తాము.రాజమౌళి మాకు బాబాయ్ అవుతాడు.

దాంట్లో షార్ట్ కట్ గా బాబా.అలా పిలిస్తే ఆయనకు ఇష్టం.బాబా అని పిలవమని ఆయనే మాకు చెప్పారు.మేమంతా ఆయన్ని బాబా అనే పిలుస్తాము అని తెలిపారు.మరి రాజమౌళి ఇకపై ఈవెంట్స్ లో, బయట కనిపిస్తే బాబా అని పిలుస్తారేమో అభిమానులు చూడాలి మరీ.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురీపిస్తున్నారు.బాబా బాబా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube