బీఆర్ఎస్ లో బాస్ కేసీఆర్( KCR ) మాట అంటే మాటే.ఆయన అంతటి స్ట్రాటజీతో ఉన్నారు కాబట్టి, రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.
ఇప్పుడు కూడా అదే ఊపుతో మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు.ఈ తరుణంలోనే అన్ని పార్టీలకు అందకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి సరికొత్త స్టాటజీతో ముందుకు వెళ్తున్నారు.
అయితే కేసీఆర్ ఏది చేసిన సెంటిమెంట్ గా చేస్తారనేది చాలామందికి తెలుసు.ప్రతి దాంట్లో సెంటిమెంట్ వెతుకుతారు.
ఆ సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు.అయితే ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవ్వనున్నారు సీఎం కేసీఆర్( CM KCR ).నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేసీఆర్ ఈ లోగా అన్ని నియోజకవర్గాల చుట్టేసి ప్రజల్లో కొత్త జోష్ పెంచాలని చూస్తున్నారు.
ఈ తరుణంలోని ఎన్నికల శంఖారావం అక్టోబర్ 15వ తేదీన మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.అది కూడా ఆయనకు సెంటిమెంటుగా కలిసివచ్చే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మొదటి సభ నిర్వహించి ఆ తర్వాత సిద్దిపేట( SIDDIPET ), సిరిసిల్ల( SIRISILLA ) ఇలా తెలంగాణ మొత్తం పర్యటన చేయనున్నారు.మరి కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎందుకు మొదటి బహిరంగ సభ పెడతారు అంటే.
ఆయనకు మొదటి నుంచి హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఏ పని మొదలుపెట్టిన కలిసి వస్తుందట.హుస్నాబాద్( HUSNABAD ) హైదరాబాద్ కు( HYDERABAD ) ఈశాన్యం దిశలో ఉండడం వల్ల ఈశాన్యంలో ఏ పని మొదలుపెట్టిన కేసీఆర్ కు లాభం చేకూరుస్తుందని నమ్ముతారు.
హుస్నాబాద్( Husnabad ) గడ్డపై ఏది మొదలుపెట్టిన ఆయన వెనక్కి రాలేదని, ఇప్పటికే 2014లో ఎన్నికల ముందు హుస్నాబాద్ నుంచే సభ మొదలుపెట్టి విజయం సాధించారు.ఆ తర్వాత 2018లో ముందస్తుకు వెళ్లి హుస్నాబాద్ నుంచి మొదటి సభ పెట్టి విజయం సాధించారు.ఈసారి కూడా అక్టోబర్ 15న మొదటి సభ హుస్నాబాద్ నుంచి పెట్టి ఎన్నికల శంఖారావం మోగించి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్(KCR) భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరి చూడాలి ఈ సభ కేసీఆర్( KCR ) ను సక్సెస్ దిశగా తీసుకెళ్తుందా, లేదంటే ఓటమిపాలు చేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.