కే‌సి‌ఆర్ కు" గజ్వేల్ " భయం.. పట్టుకుందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM kcr )పోటీ చేస్తే స్థానం మారబోతుందా ? ఆయన ఈసారి గజ్వేల్ ( Gajwel )బరిలో నిలిచే అవకాశం లేదా ? అసలెందుకు ఈ రకమైన చర్చ జరుగుతోంది ? అనే ప్రశ్నలు ఇటీవల పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి.ఎందుకంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఇటీవల చేసిన వ్యాఖ్యాలే అందుకు కారణం.

 Kcr Is Afraid Of gajwale.. Has He Caught, Cm Kcr , Gajwel, Revanth Reddy, Brs, T-TeluguStop.com

కే‌సి‌ఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.అంతే కాకుండా ఈసారి గజ్వేల్ లో కే‌సి‌ఆర్ ఓటమి పక్కా అంటూ కుండ బద్దలుకొట్టారు.

దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

Telugu Congress, Gajwel, Revanth Reddy, Telangana-Politics

గత కొన్నాళ్లుగా కే‌సి‌ఆర్ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది.వచ్చే ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం లేదంటే టాక్ గట్టిగా వినిపిస్తోంది.ఈ నియోజిక వర్గంలో కే‌సి‌ఆర్ పై కొంత వ్యతిరేకత ఏర్పడిందని.

అందుకే అనుకున్న స్థాయిలో ఇక్కడ మెజారిటీ రాకపోవచ్చనే ఆలోచనతోనే కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి తప్పుకుంటున్నాట్లు పోలిటికల్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే కే‌సి‌ఆర్ గజ్వేల్ తో పాటు మరో నియోజిక వర్గం నుంచి కూడా బరిలో దిగే ఆలోచనలో ఉన్నాడట.

Telugu Congress, Gajwel, Revanth Reddy, Telangana-Politics

ఒక చోట మెజారిటీ తగ్గిన మరో చోట మెజారిటీ కలిసొస్తుందని అందుకే రెండు చోట్ల బరిలో దిగేందుకు కే‌సి‌ఆర్ సిద్దమౌతున్నట్లు ఇన్ సైడ్ టాక్.ఇదే గనుక నిజం అయితే ప్రత్యర్థి పార్టీలకు కే‌సి‌ఆర్ అదును ఇచ్చినట్లే అవుతుందనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే కే‌సి‌ఆర్ గజ్వేల్ లో ఓటమి భయంతోనే రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమౌతున్నారనే విమర్శను ప్రత్యర్థి పార్టీలు బలంగా లేవనెత్తే అవకాశం ఉంది.ఇప్పటికే రేవంత్ రెడ్డి కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టె విధంగా సవాల్ చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే తప్పకుండా ఒడిస్తామని చెబుతున్నారు.దీంతో కే‌సి‌ఆర్ పోటీ చేస్తే స్థానంపై పోలిటికల్ హీట్ పెరుగుతోంది.మరి సి‌ఎం కే‌సి‌ఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న సంచలనమే అవుతాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో ( Politics )రెండు స్థానాల్లో బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube