కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి యువ డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ (Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఖైదీ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం విజయ్ మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు.
ఇలా విక్రమ్ సినిమా తర్వాత ఈయన పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో లోకేష్ స్టార్ హీరోల సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన విజయ్ హీరోగా నటించిన లియో సినిమాకు( Leo Movie ) దర్శకత్వం వహించారు.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ లోకేష్ కు మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు వేయడంతో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చారు.మీడియా ప్రతినిధులు లోకేష్ ను ప్రశ్నిస్తూ తన ప్రాజెక్ట్స్ గురించి చెప్పమన్నారు.అయితే ప్రస్తుతం లియో పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉందని తదుపరి రజిని సార్ తో తన సినిమా ఉంటుందని తెలిపారు.ఆ తర్వాత ఖైదీ సీక్వెల్ అలాగే విక్రమ్ సీక్వెల్ ఉంటుందని తెలిపారు.
ఇకపోతే సూర్య(Suriya) సార్ కోసం నేను ఒక కథ సిద్ధం చేసుకున్నానని తెలిపారు.
నేను పదేళ్లుగా ఇరుంబు కై మాయావి అనే ఓ కథ కూడా రాసుకున్నాను.ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్(Dream Project) ఈ కథను తాను సూర్య సార్ తో చేస్తానని ఈ సందర్భంగా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా తన డ్రీం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత అజిత్ సార్ తో కూడా అవకాశం వస్తే చేస్తానని తెలిపారు.
ఇలా వరుస ప్రాజెక్ట్స్ గురించి లోకేష్ అనౌన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తాను డైరెక్టర్ గా తప్పుకుంటానంటూ లోకేష్ మరోసారి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.