మహేష్ కూతురు మంచి మనస్సుకు ఫిదా కావాల్సిందే.. ఆ పిల్లలకు వాటిని బహుమతిగా ఇవ్వడంతో?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార( Sitara Ghattamaneni ) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు యాడ్స్ లో నటించడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.ఈరోజు మహేష్ కూతురు సితార పుట్టినరోజు( Sitara Birthday ) అనే సంగతి తెలిసిందే.

 Mahesh Babu Daughter Sitara Kind And Great Heart Details, Mahesh Babu, Sitara, S-TeluguStop.com

మహేష్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలవగా సితార కుడా అదే విధంగా సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా సితార కొంతమంది యువతులకు సైకిళ్లను పంపిణీ చేయడం గమనార్హం.

ఈరోజు సితార 11వ వడిలోకి అడుగుపెట్టారు.సోషల్ మీడియా వేదికగా సీతూ పాపకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కూతురి పుట్టినరోజు గురించి మహేష్( Mahesh Babu ) స్పందిస్తూ నా చిన్నారి పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు.నా ప్రపంచంలో నువ్వే స్టార్ వని నువ్వు ఏదైనా సాధించగలవని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా తన టాలెంట్ తో సితార స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.మహేష్ బాబు ఫౌండేషన్ లో యువతులతో కలిసి సితార పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.కేక్ కట్ చేయడంతో పాటు పింక్ కలర్ లో ఉన్న సైకిళ్లను( Cycles ) సితార గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.పీఎంజే జ్యూవెలరీ యాడ్ లో సితార నటించగా ఈ యాడ్ సితార కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సితార కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.సితారకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.సితార రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Mahesh Babu Daughter Sitara Gifts Cycles to Girls

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube