ఎర్ర చెరువులో వలకు చిక్కిన వింత చేప..

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం ఎర్ర చెరువులో చేపల కోసం వల వేసిన కొంతమందికి వింత చేప చిక్కింది.ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

 Fishermen Caught Strange Cat Fish In Erra Cheruvu, Fishermen ,strange Cat Fish ,-TeluguStop.com

సాధారణంగా అక్వేరియంలో పెరిగే ఈ చేప దురదృష్టవశాత్తు చెరువుల్లో చేరింది.సక్నోస్ క్యాట్ ఫిష్ గా పిలవబడే ఈ చేప ఇతర చేపలను భారీగా ఆహరంగా తీసుకుంటుంది.

దీని శాస్త్రీయ నామం పేటరీగోప్లిచ్థిస్ మల్టీరాడియటస్.

లోరికారిడే కుటుంబానికి చెందిన ఈ చేప వాజాలు రెక్కలను పోలి బలంగా ఉంటుంది.

సాధారణంగా ఈ చేపలు మంచి నీటి వరద ప్రవాహల్లోను, బురద అడుగు భాగంలోను కఠినమైన వాతావరణాల్లో కూడా మనుగడ సాధిస్తుంది.గరిష్టంగా 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది.

ఇతర దేశాల్లో దీనిని లాంగ్ ఆర్మడ్ క్యాట్ ఫిష్ అని పిలుస్తారు.ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో లభ్యమైన ఈ చేపను ప్రజలు వింతగా తిలకిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube